CBI Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్లు నోటీసుల్లో పేర్కొంది సీబీఐ.. ఇక, సీబీఐ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. నాకు సీబీఐ నోటీసులు అందాయి.. వివరణ కోసం మాత్రమే నాకు నోటీసులు ఇచ్చారు.. దీనిపై సీబీఐ అధికారులకు కూడా నేను సమాచారం ఇచ్చాను.. వాళ్ల రిక్వెస్ట్ మేరకు డిసెంబర్ 6వ తేదీన మా ఇంటి దగ్గర సీబీఐ అధికారులను కలుస్తానని తెలిపారు.. మా ఇంటి దగ్గర సీబీఐ అధికారులకు కలుస్తా.. నన్ను అడిగిన సమాచారాన్ని వారికి చెబుతానన్న కవిత.. సీబీఐ పంపిన నోటీసులను కూడా మీడియాకు షేర్ చేశారు.
Metro Rail: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఏ క్షణమైనా కవితకు సీబీఐ,ఈడీ నోటీసులు రావొచ్చనే చర్చ సాగుతోన్న సమయంలో.. ఆమెకు నోటీసులు రావడం గమనార్హం.
