NTV Telugu Site icon

JD Lakshmi Narayana: వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?

Jd Lakshminarayana

Jd Lakshminarayana

CBI EX JD Lakshminarayana Tweet Goes Viral: తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో పాల్గొన్న జేడీ.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.

నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని, అంగన్వాడీలలో చిన్న పిల్లలకు పౌష్టికాహారం రాగిజావ ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో.. వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందన్నారు. ఏపీ సీఎంను వివిధ కేసులలో అరెస్టు చేసిన సీబీఐ మాజీ జేడీ… అదే జగన్ పరిపాలనను అభినందించడం పట్ల సర్వత్రా చర్చగా మారింది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈరోజు ఉదయం ఎక్స్‌లో సీబీఐ మాజీ జేడీ క్లారిటీ ఇచ్చారు. వైసీపీలో చేరుతున్నానే ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని, ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ద్వారా వైసీపీలో చేరడం లేదని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.

Also Read: Kuldeep Yadav Ball: కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ బాల్.. బిత్తరపోయిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్

‘శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నా. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నా’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎక్స్‌లో పేర్కొన్నారు.