Site icon NTV Telugu

Operation Garuda: ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

Operation Garuda

Operation Garuda

Operation Garuda: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ‘ఆపరేషన్’ గరుడ పేరుతో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరాలపై సోదాలు చేపట్టింది. ఇంటర్‌పోల్, ఎన్సీపీతో పాటు రాష్ట్రాల పోలీసులతో కలిసి సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’ను చేపట్టింది. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రతో పాటు అనేక ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో ఎన్సీబీ, రాష్ట్ర పోలీసు అధికారులు సుమారు 6600 మంది అనుమానితులను తనిఖీ చేశారు. ఇప్పటికే 150 మంది డ్రగ్ పెడ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. 127 కొత్త కేసులు నమోదయ్యాయి.

సీబీఐ అనేక దశలుగా “ఆపరేషన్ గరుడ”ను ప్రారంభించింది. దేశంలో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ఇంటర్‌పోల్, ఎన్సీపీ, రాష్ట్రాల పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టింది. హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టితో మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడానికి ఇది ప్రారంభించబడింది. ఆపరేషన్ గరుడ సమయంలో, భారతదేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అరెస్టులు జరిగాయి. సీబీఐ, ఎన్సీబీతో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, మణిపూర్‌తో సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలివే..

హెరాయిన్ – 5.125 కేజీలు (సుమారుగా)
గంజాయి- 33.936 కేజీలు (సుమారు)
చరస్- 3.29 కిలోలు (సుమారు)
మెఫెడ్రోన్ – 1365 గ్రా (సుమారు)
స్మాక్- 33.80 (సుమారు)
బ్యూప్రెనార్ఫిన్- దాదాపు 87 మాత్రలు, 122 ఇంజెక్షన్లు & 87 సిరంజీలు
అల్పజోలం- 946 మాత్రలు (సుమారు)
ట్రామాడోల్- 105.997 కేజీ (సుమారు)
హాష్ ఆయిల్ – 10 గ్రా (సుమారు)
ఎక్స్టసీ మాత్రలు – 0.9 గ్రా (సుమారు)
నల్లమందు – 1.150 కిలోలు (సుమారు)
గసగసాల పొట్టు – 30 కిలోలు (సుమారుగా)
మత్తు పొడి – 1.437 కేజీలు (సుమారుగా)
మాత్రలు/క్యాప్సూల్స్- 11039 (సుమారు)

Exit mobile version