NTV Telugu Site icon

Cauliflower cultivation : కాలీఫ్లవర్ పంటతో అధిక లాభాలను పొందుతున్న రైతులు..

Califlower

Califlower

తెలుగు రాష్ట్రాల్లో కాలీఫ్లవర్ ను కూడా అధికంగా పండిస్తున్నారు రైతులు.. క్యాలిఫ్లవర్ చల్లని, వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణాలలో మంచి దిగుబడులను సాధించవచ్చు.. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ పంటను వెయ్యడానికి ఎర్రనేలలు, దుబ్బనేలలతో పాటు ఒండ్రునేలలు, బంకమట్టి నేలల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. ఏడాదిలో రెండు పంటల కాలల్లో సాగు చేయవచ్చు. వర్షాకాలంలో జులై, ఆగస్టు మాసాల్లో నాటుకోవచ్చు. అలాగే, సెప్టెంబర్, నవంబర్ మాసాల్లోనూ నాటుకోవచ్చు. ఆయా కాలల్లో పంటను సాగు చేయడానికి నేలను రెండు మూడు సార్లు దున్నుకోవాలి.

నేలను తయారు చేసుకునే ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును, 100 కిలోల వేపపిండి, 300 కిలోల బోకాషి, ఒక కిలో సుడోమోనాస్ ను కలుపుకుని నేలను సిద్ధం చేసుకునే సమయంలో దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత నేలను చదునుగా దున్నుకోవాలి. మొక్కలు నాటడానికి అనుకూలంగా బోదేలు తయారు చేసుకోవాలి. నేల తయారీ సమయంలో పై ఎరువులు వేసుకోవడం వల్ల పంట నాణ్యత మెరుగ్గా ఉంటుంది.. అధిక దిగుబడిని పొందవచ్చు.. చీడపీడలు సైతం రాకుండా ఉండి, దిగుబడి పెరుగుతుంది..

కాలిఫ్లవర్ కు మార్కెట్ మూడు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. వాటిల్లోంచి మన సాగు చేసే నేలకు అనువైన రకాలను ఎంచుకోవాలి. ఒక ఎకరం పొలానికి దాదాపు 300 నుంచి 350 గ్రాముల వరకు విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను విత్తుకోవడానికి ముందు రోజు విత్తన శుద్ధి చేయాలి. ఇందుకోసం 4 గ్రాముల ట్రైకోడెర్మావిడిని ఉపయోగించుకోవాలి. నారు మొక్కలకు నిత్యం నిరందించాలి. నారు మొక్కలను సాగు చేసే పొలంలో మొక్కకు మొక్కకు మధ్య దూరం 45 సెంటీమీటల్లు ఉండేలా నాటుకోవాలి.. తెగుళ్లు ఉంటే వెంటనే కనిపెట్టి వాటిని నివారణ చర్యలు తీసుకోవడం మేలు.. ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..