NTV Telugu Site icon

Woman Hit By Car: వీధికుక్కల ఆకలి తీరుస్తున్న యువతిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

Woman Hit By Car

Woman Hit By Car

Woman Hit By Car: సెలవు రోజు అంటే చాలు… స్నేహితులతో ఏ సినిమాకు వెళ్లాలి? ఏ ప్లేస్‌కు టూర్​ వేయాలి?… ఇలా రకరకాల ప్లాన్స్‌తో ఉంటారు చాలామంది. కానీ, ఆమె మాత్రం ఆదివారం వచ్చిందంటే… వీధికుక్కలకు ఆహారాన్ని తీసుకెళ్తుంది. ఇలానే వీధి శునకాలపై ప్రేమతో తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంది ఛండీగఢ్‌లోని తేజస్విత.

చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతి తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా కుక్కతో పాటు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తేజస్విత కింద పడిపోగా, శునకం అక్కడి నుంచి పరారైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. తేజశ్విత తలకు గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వారితో మాట్లాడిందని, బాగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తేజశ్విత రోజూ తన తల్లితో కలిసి వీధికుక్కలకు ఆహారం ఇచ్చేందుకు వెళ్లేదని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి తేజశ్విత, ఆమె తల్లి మంజీదర్‌ కౌర్‌లు ఫుట్‌పాత్‌ పక్కనే వీధికుక్కలకు ఆహారం ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.

యువతిపైకి కారు దూసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. రక్తపు మడుగులో పడి ఉన్న తేజశ్వితను చూసి తల్లి నివ్వెరపోయింది. సహాయం చేయడానికి ఎవరూ ఆగలేదని ఆమె చెప్పింది. ఆమె ఇంటికి, పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తేజశ్విత తండ్రి ఓజస్వి కౌశల్ తెలిపారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు రోజూ తన తల్లితో కలిసి వెళ్లేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి వాహనం, డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Road Accident: పల్టీలు కొట్టిన వాహనం.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

వరుస భయానక ప్రమాదాలు ర్యాష్ డ్రైవింగ్‌ను వెలుగులోకి తెచ్చాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది ఢిల్లీ కార్ హర్రర్ కేసు, ఇందులో 20 ఏళ్ల మహిళ కారు కింద కాలు ఇరుక్కుపోయి, వాహనం ఆమెను రోడ్లపైకి లాగడంతో మరణించింది. మరో విషాద ఘటనలో గురుగ్రామ్-ఫరీదాబాద్ రహదారిపై వేగంగా వస్తున్న పోలీసు వ్యాన్ కారును ఢీకొట్టింది. ఆరేళ్ల బాలిక మృతి చెందగా, ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. దిగ్భ్రాంతికరంగా, పోలీసు సిబ్బంది చిన్నారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించలేదు. బదులుగా, అక్కడి నుండి పారిపోయారు.