Site icon NTV Telugu

Cat attacks Owner: పిల్లి పులి అవ్వడం అంటే ఇదేనేమో… యజమానికి చుక్కలే!

Cat

Cat

Cat attacks Owner: ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కులు, పిల్లులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు మనం పెంచుకునే జంతువులే మనపై దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే 35 మిలియన్ల మందికి పైగా చూశారు. లక్షల సంఖ్యలో లైక్ చేశారు. చూడటానికి కొంచెం భయంగా ఉన్న ఈ వీడియో చూస్తే మీరు కూడా పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఖాయం.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫ్రిడ్జ్ జరుపుతూ ఉంటాడు. పక్కనే వాళ్ల పెంపుడు పిల్లి కూడా ఉంటుంది. ఏమయ్యిందో ఏమో కానీ ఆ పిల్లి అతనిపై దాడి చేయడం మొదలు పెడుతుంది. వేరే మహిళ ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది అతనిపై దాడి చేస్తూనే ఉంటుంది. అతను కటెన్స్ పక్కన దాక్కున్నా కూడా అందులోకి వెళ్లి మరీ అతనిపై దాడిని కొనసాగిస్తోంది. భయంతో అతను ఒక రూం లాంటి దాంట్లో దాక్కుంటాడు. అది దాంట్లోకి దూరి కూడా అతడిని భయానికి గురిచేస్తోంది. ఆ వ్యక్తి ఆ గది నుంచి బయటకు వచ్చి దాన్ని దాని లోపల పెట్టి గడియపెట్టేయడంతో ఆ వ్యక్తి పిల్లి దాడి నుంచి బయట పడగలుగుతాడు.

Also Read: Viral Video: వీడు మామూలోడు కాదురా సామీ… సింహాన్నే చెప్పుతో కొట్టిన వ్యక్తి!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లి పులిగా మారి యజమానికి చుక్కలు చూపించిందని, ఏం చేశావయ్య దానికి అంత కోపం వచ్చిందని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీడియో చూస్తే మాత్రం కూసంత భయంగానే అనిపిస్తోంది.

Exit mobile version