Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత ప్రభుత్వం జనాభా గణనలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. ప్రతిపాదిత 2021 జనాభా లెక్కల ప్రస్తుత స్థితిపై పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు అడిగారు. దీంతోపాటు ప్రతిపాదిత జనాభా గణనలో కులం, ఉపకులాల ప్రాతిపదికన జనగణన నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా అని సభ్యులు పార్లమెంట్‌లో అడిగారు.
China: చైనాలో నిమ్మకాయలకు భలే డిమాండ్.. కొవిడ్‌తో పోరాడుతున్న డ్రాగన్
ఆ ప్రశ్నలకు హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. 2021 జనాభా లెక్కలను నిర్వహించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని మార్చి 28, 2019న గెజిట్ ఆఫ్ ఇండియాలో తెలియజేసినట్లు తెలిపారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా.. 2021లో జరగాల్సిన జనగణనతో పాటు సంబంధిత కార్యకలాపాలు తదుపరి ఉత్తర్వుల వరకు వాయిదా వేయబడ్డాయని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్డర్ ప్రకారం కాలానుగుణంగా సవరించబడిన షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు)గా ప్రత్యేకం నోటిఫై చేయబడిన కులాలు, తెగలు లెక్కించబడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని ఆయన బదులిచ్చారు. ప్రతిపాదిత జనాభా లెక్కల కోసం ఖర్చు చేసే నిధుల వివరాలను అడిగినప్పుడు.. 2021 భారత జనాభా లెక్కల అమలు కోసం ప్రభుత్వం రూ. 8754.23 కోట్లను ఆమోదించిందని చెప్పారు.