NTV Telugu Site icon

Dilbag Singh: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు, మద్యం, విదేశీ ఆయుధాలు లభ్యం

Ed Ridas

Ed Ridas

ED Raids: అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో పంజాబ్‌, హర్యానాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 20కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు చేస్తుండగా అక్రమ విదేశీ ఆయుధాలు, 300కు పైగా కార్ట్రిజ్‌లు, 100కు పైగా విదేశీ మద్యం బాటిళ్లు, 5 కోట్ల రూపాయల డబ్బు, సుమారు 5 కేజీల బంగారు, వెండి ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Mohalla Clinics: కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు.. ఆప్ “మొహల్లా క్లినిక్‌ల”పై సీబీఐ విచారణకి ఆదేశం..

అయితే, దిల్‌బాగ్‌తో పాటు అతని అనుచరుల ఇండ్లలోనూ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. అదే విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురీందర్‌ పన్వర్‌ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇక, ఈ మధ్య ఈడీ అధికారులు వరుసగా తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో కోట్ల డబ్బును సీజ్ చేశారు.