JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై యాడికి, తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు పోలీసులు.. యాడికి మండలం రాయల చెరువు, తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఇసుక ట్రాక్టర్ల టైర్లకు గాలి తీసి.. డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.. అయితే, యాడికి మండలం రాయలచెరువు గ్రామం వద్ద ఇసుక టిప్పర్ కు అడ్డుగా వచ్చి ఇనుప చువ్వతో టైర్లు పంచర్ చేశారని.. డ్రైవర్ ను భయభ్రాంతులకు గురిచేశాడని గుంతకల్ కు చెందిన చాకలి నరసింహులు ఫిర్యాదు చేశారు.. దీంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు మరికొందరిపై 341, 427, 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: America: డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసి 10 మంది ప్రాణాలు తీసిన నర్సు..
మరోవైపు.. తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్ కు గాలి తీసి తనపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేశారని భాస్కర్ అనే వ్యక్థి ఫిర్యాదు చేశారు.. దీంతో, తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో 341, 324, 506, 354, 427, R/w 34 IPC అండ్ Sec.3 (1) (r ) (s) of SC/ST (POA) Amendment Act సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా.. ఒకేసారి రెండు పోలీస్ స్టేషన్లలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి.