Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై కేసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు.
ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత కాగా.. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 డిసెంబర్ 29న వ్యూహంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నించగా.. ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల కూడా నిలిపివేయాలని కోరారు. ఎన్నో సందిగ్ధత మధ్య 2024 మార్చిలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?