NTV Telugu Site icon

Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మపై కేసు!

ram gopal varma

ram gopal varma

డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు.

ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా ‘వ్యూహం’. దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాత కాగా.. అజ్మల్‌ అమీర్‌, మానస రాధాకృష్ణన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 డిసెంబర్‌ 29న వ్యూహంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నించగా.. ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా విడుదల కూడా నిలిపివేయాలని కోరారు. ఎన్నో సందిగ్ధత మధ్య 2024 మార్చిలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్జీవీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ.

Show comments