NTV Telugu Site icon

Virat Kohli Pub: విరాట్‌ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు!

Virat Kohli Pub

Virat Kohli Pub

Case against Virat Kohli’s One8 Commune Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌పై కేసు నమోదైంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహించినందుకు గాను బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి 1.30 గంటల వరకు తెరిచి ఉన్నందుకు బెంగళూరులోని వన్‌8 కమ్యూన్‌ మేనేజర్‌పై కేసు నమోదైంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో విరాట్ కోహ్లీకి చెందిన వన్‌8 కమ్యూన్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ల నంచి పెద్దశబ్దంతో సంగీతం వినిపిస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దాంతో రైడ్ చేసిన పోలీసులు.. పబ్‌ల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకే పబ్‌లకు అనుమతి ఉంది.

Also Read: Usha Uthup Husband: ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ భర్త కన్నుమూత.. టీవీ చూస్తూ..!

బెంగళూరుతో పాటుగా ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతాలో వన్‌8 కమ్యూన్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి. బెంగళూరు పబ్‌ను 2023 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఇది రత్నం కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఉంది. కస్తూర్బా రోడ్డులో ఉన్న ఈ పబ్‌ నుంచి కబ్బన్‌ పార్క్‌, చిన్నస్వామి స్టేడియంలను చూడొచ్చట. ఇక టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం విరాట్ కోహ్లీ లండన్ వెళ్లాడు. తన భార్య, పిల్లలను కలవడానికి వెళ్లాడు. చాలా వారాలు విరాట్ అక్కడే ఉండనున్నాడు.