Site icon NTV Telugu

Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!

Shilpa Shetty

Shilpa Shetty

Case Filed on Bollywood Actress Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. గోల్డ్ స్కీమ్‌ (బోగస్‌ బంగారం పథకం)తో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది.

తనను మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రాలు సహా వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇద్దరు డైరెక్టర్లు మరియు ఒక ఉద్యోగిపై రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరు మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, దర్యాప్తు చేయాలని బీకేసీ పోలీస్ స్టేషన్‌ను ముంబై కోర్టు ఆదేశించింది. మోసం చేసినట్లు తేలితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను కోరారు.

Exit mobile version