Case Filed Against RJ Shekhar: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్ అనంతరం లావణ్యపై శేఖర్ దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ.. దాడికి దిగాడు. కడుపు మీద తన్ని చేతికి గాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆర్జే శేఖర్ బాషా తన కడుపు మీద తన్ని చేతికి గాయం చేశాడంటూ తాజాగా లావణ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో శేఖర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెక్షన్ 74, 115(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఇక హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ జులై 5న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తీవ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
రాజ్ తరుణ్, లావణ్యల వివాదంలోకి శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. లావణ్యపై పలు ఆరోపణలు గుప్పించారు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని, ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఆరోపించాడు. ఈ విషయంపై ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో డిబేట్ జరగగా.. లావణ్య, శేఖర్ మధ్య తీవ్ర చర్చ జరిగింది. తనపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఆగ్రహానికి గురైన లావణ్య.. ఒక్కసారిగా అతడిపై చెప్పుతో దాడి చేశారు. దీంతో శేఖర్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం శేఖర్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.