Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ నంద్యాలకు విచ్చేశారు బన్ని. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. గంటన్నరకు పైగా అక్కడే ఉన్నారు. కాసేపు మీడియాతో మాట్లాడి తిరుపతి వెళ్లారు. అల్లు అర్జున్ రాక గురించి వైసీపీ నేతలు ముందే సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో.. బన్నిని చూసేందుకు వేల మంది అభిమానులు ఎమ్మెల్యే రవి ఇంటికి చేరుకున్నారు. అక్కడ హంగామా చేశారు. శిల్పారవి తనకు మంచి మిత్రుడన్నారు అల్లుఅర్జున్. ఎప్పుడు కలిసినా నంద్యాల అభివృద్ధి గురించే చెబుతుంటారన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదన్న అర్జున్.. మిత్రులు ఏ రంగంలో ఉన్నా వాళ్లకోసం వెళ్తానన్నారు.
Read Also: Road Accident: విశాఖలో ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు దుర్మరణం..
అయితే, ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వ్యక్తిగతమైనా, భారీగా జనం వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంది.. అయితే, ఎలాంటి అనుమతులు భారీ జన సమీకరణ చేసినందుకు కేసు నమోదు చేయాలని టూ టౌన్ పోలీసులను ఆదేశించారు ఆర్వో జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి . ఈ మేరకు అల్లు అర్జున్ తో పాటు ఎమ్మెల్యే శిల్పారవిపై కూడా ఐపీసీ సెక్షన్ 188 కేసు నమోదు చేశారు సీఐ రాజారెడ్డి. మొత్తంగా ఎన్నికల వేళ స్నేహితుడి కలిసేందుకు వెళ్లిన పుష్ప.. ఇలా కేసులు ఇరుక్కున్నాడు.