NTV Telugu Site icon

Obscene Video: మూడో తరగతి బాలికకు అసభ్యకర వీడియో చూపించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు

School

School

Obscene Video: అతడో పాఠశాల ప్రిన్సిపాల్.. విద్యార్థుల పట్ల బాధ్యతగా మెలగాలి.. వారిని సన్మార్గంలో నడుపుతూ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాడు కట్టుతప్పాడు. విద్యార్థినులను కూతుళ్లలా చూడాల్సిన వాడు ఓ విద్యార్థినికి డర్టీ పిక్చర్ చూపించాడు. చివరికి విషయం తల్లిదండ్రుల వద్దకు చేరడంతో అతనిపై కేసు నమోదైంది.

ఉత్తరప్రదేశ్‌లో బదౌన్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థినికి అసభ్యకర వీడియో చూపించినందుకు ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. సెప్టెంబరు 15న పాఠశాల ప్రిన్సిపాల్ బాలికను తన గదికి పిలిచి తన మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన వీడియో, చిత్రాలను చూపించాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కిషోర్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు అనంతరం సార్ కొత్వాలి ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఈ విషయం దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Student Shoots Teacher: తిట్టాడన్న కోపంతో ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు

ఈ ఘటన గురించి బాలిక మొదట్లో మౌనంగా ఉండిపోయిందని, శనివారం మాత్రమే తమకు సమాచారం అందించిందని, ఆ తర్వాత తాము పోలీసులను ఆశ్రయించామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు.

Show comments