NTV Telugu Site icon

Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతి పై క్రిమినల్ కేసు

Dimple Hayati

Dimple Hayati

Dimple Hayathi : గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతి. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో అమ్మడి అందచందాలకు కుర్రకారు వెర్రెక్కిపోయారు. తాజాగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది డింపుల్. సినిమా ఆశించిన విజయం దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఈ బ్లాక్ బోల్డ్ బ్యూటీపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఓ ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు పార్కింగ్‌ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ హీరోయిన్‌తో పాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు పెట్టారు. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఇదే అపార్ట్ మెంట్లోని ఫ్లాట్‌ నంబర్‌ సీ (2)లో టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ హయతీ తన స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.

Read Also:BRO : ఏంటి ‘బ్రో’ ఇది… ఐటమ్ సాంగ్ కు ఆ స్టార్ హీరోయినా ?

భవనానికి చెందిన పార్కింగ్‌ స్థలంలో పార్క్‌ చేసిన డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతో పాటు అకారణంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఎం.చేతన్‌ కుమార్‌తో వాగ్వాదానికి దిగుతుంటారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్‌ చేసుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14న రాత్రి పార్క్‌ చేసిన డీసీపీ అధికారిక వాహనంను డింపుల్‌ హయతీ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారుకు ఇతర వాహనాలు తగలకుండా జాగ్రత్త నిమిత్తం పెట్టిన కోన్స్‌ను, డీసీపీ కారును కాలితో తన్ని వీరంగం సృష్టించింది. ఆ సమయంలో ఇదేంటని ప్రశ్నించిన కానిస్టేబుల్‌ విధులకు ఆటంకం కలిగించింది. దీంతో కానిస్టేబుల్‌ చేతన్‌ కుమార్‌ మూడురోజుల కిందట జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డింపుల్‌ హయతీతోపాటు ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం హీరోయిన్‌ డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఆర్‌పీసీ 41(ఏ) కింద వీరిద్దరికి నోటీసులు జారీ చేశారు.

Read Also:Naresh-Pavitra Lokesh : నాకు మరో అమ్మ దొరికింది..ఉద్వేగభరితమైన నరేష్

Show comments