అత్యాధునిక కార్డియాక్ కేర్‌తో క్రిటికల్‌గా ఉన్న రోగికి కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను రక్షించింది. హైదరాబాద్‌లో గుండె పోటుతో బాధపడుతున్న 68 ఏళ్ల శ్రీమతి సుభాషిణి (పేరు మార్పు)కు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసు, అధునాతన కార్డియాక్ కేర్, వినూత్నమైన సాంకేతికతలు, మరియు మల్టీడిసిప్లినరీ విధానంతో ఎలా ప్రాణాలను రక్షించగలమో నిరూపించింది.
రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్, కాలేజెన్ వాస్కులార్ డిసీజ్ మరియు డయాబెటిస్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. అక్యూట్ మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండె పోటు) కారణంగా శ్రీమతి సుభాషిణి ఆసుపత్రిలో చేరారు. ఆమె గుండె ఆర్టరీలలో తీవ్రమైన బ్లాకేజ్లు, ఎడమ వెంట్రిక్యులర్ సిస్టోలిక్ డిస్ఫంక్షన్ (గుండె వైఫల్యం) మరియు అధిక ప్రమాదకరమైన క్లినికల్ ప్రొఫైల్ కారణంగా సాంప్రదాయ కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ (CABG) చేయడం ప్రమాదకరమని కేర్ హాస్పిటల్స్ డాక్టర్లు నిర్ణయించారు. క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ వి.సూర్య ప్రకాశ రావు నేతృత్వంలో కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, నెఫ్రాలజిస్టులు సహా ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీమ్, ప్రాణాలను రక్షించే వైద్యం రూపొందించారు.
అత్యంత ప్రమాదకరమైన పర్స్యూటేనియస్ కొరోనరీ ఇంటర్వెన్షన్ (PCI)ను, ఇన్‌ట్రావాస్కులార్ అల్ట్రాసౌండ్ (IVUS) మార్గదర్శకత్వంలో స్టెంట్ ప్లేస్‌మెంట్ ద్వారా నిర్వహించారు. ప్రొసీడ్యూర్ సమయంలో, ఆ తర్వాత సుభాషిణి గుండె పనితీరును మద్దతుగా నిలిపేందుకు.. ఇంపెల్లా స్మార్ట్ అసిస్టెంట్ అనే అత్యాధునిక మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డివైస్‌ను ఉపయోగించారు. ఈ డివైస్ ఫెమోరల్ ఆర్టరీ ద్వారా ప్రవేశపెట్టబడింది. 5-7 రోజులు ఇంటెన్సివ్ కొరోనరీ కేర్ యూనిట్ (ICCU)లో ఆమె రక్తపోటు, గుండె పనితీరును సమర్థంగా నిర్వహించింది.