Site icon NTV Telugu

Road Accident: కేబుల్ బ్రిడ్జి వద్ద పల్టీ కొట్టిన కారు.. నలుగురికి గాయాలు

Cable

Cable

హైదరాబాద్ మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త నిర్లక్ష్య కారణంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే!

వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీ హిల్స్ నుండి ITC కోహినూర్ హోటల్ వైపు వస్తున్న బ్రీజా కారు (B.No: TS09FB4896)పల్టీ కొట్టింది. కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాద ఘటన నుండి కారును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. మరోవైపు కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

Exit mobile version