NTV Telugu Site icon

Shocking : పార్కింగ్లోని బైకును ఢీకొట్టి.. 3కి.మీ మంటలొస్తున్నా లాక్కెళ్లాడు

Gurugram Car

Gurugram Car

Shocking : గురుగ్రామ్‎లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోండా సిటీ కారు రోడ్డు పక్క పార్కింగులోని బైకును ఢీకొట్టింది. అనంతరం ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇతర ప్రయాణికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు.. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 65లో బుధవారం రాత్రి మోనూ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన తన మోటర్ సైకిల్ ఆపాడు.

Read Also: Fake coins: బస్తాల్లో నకిలీ నాణేలు.. లెక్కించలేక పోలీసులకు చెమటలు

ఆ సమయంలో అటుగా వేగంగా వచ్చిన హోండా సిటీ కారు.. బైక్‌ను ఢీ కొట్టింది. తృటిలో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో కారు కింద బైక్‌ ఇరుక్కుపోవడంతో దాన్ని మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న జనం కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారులో ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బైక్‌ను కారు ఈడ్చుకెళ్లిన సమయంలో రోడ్డుపై నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.