ఈ మధ్య చాలా బాగా డ్రైవింగ్ చేసే వాళ్లు కూడా ఏదొక సందర్భంలో ఎక్కడో చోట పొరపాటు చేస్తుంటారు.. సాధారణంగా వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలుసు.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. ప్రస్థుతం సోషల్ మీడియాలో ఒక కారు డ్రైవింగ్ వీడియో హల్‌చల్ చేస్తుంది.
అయితే ఆ డైవర్ ఏం జాగ్రత్తలు పాటించాడో తెలియదు గానీ కారు డ్రైవ్ చేసేప్పుడు మాత్రం మెదడు.. మోకాళ్లో పెట్టినట్టుగా ఉన్నాడు. ఫలితంగా తిన్నగా రోడ్డుపై పొవాల్సిన కారు.. ఓ కొండకు వెళ్లే దారిలోకి వెళ్లిపోయింది.. అది కూడా అడ్డ దిడ్డంగా చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ డ్రైవింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో డ్రైవర్ ఏ లోకంలో ఉండి బండి నడిపాడో తెలియదు కానీ ఏకంగా కొండపైకి ఎక్కి కూర్చోవడంతో అందరూ షాక్ అయ్యారు..
ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోలో మాత్రం కారుతో రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లుగా ఉంది. కారును ముందుకు వెనకకు తిప్పుతూ సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు తన దగ్గర ఉన్న టాలెంట్‌ని మొత్తం ప్రదర్శిస్తున్నాడు. చూడటానికి మనకు కామెడీగా ఉన్న ఇటువంటి డ్రైవింగ్ టాలెంట్ చూస్తేంటే ఓ వేసుకోవాల్సిందే.. అతను పడిపోకుండా కారును ఆపిన తీరు అందరిని షాక్ కు గురి చేస్తుంది.. ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..
Masterpic.twitter.com/Rnm31XjZtu
— Figen (@TheFigen_) November 23, 2023