Site icon NTV Telugu

Maharashtra: పూణె తరహాలో మరో కారు బీభత్సం.. ముగ్గురు మృతి

Pune

Pune

దేశ వ్యాప్తంగా పూణె ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఓ బాలుడు మద్యం సేవించి వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలను బలి తీసుకున్న ఘటనను ఇంకా మరువక ముందే మరో ఘోరం జరిగింది. ఓ శాంత్రో కారు అత్యంత వేగంగా దూసుకురావడంతో ముగ్గురు బైకిస్టులు కిందపడిపోయారు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయాలు పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని సైబర్‌చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని సైబర్‌చౌక్‌లో ఎవరికి వారే బైకిస్టులు రోడ్డు దాటుతున్నారు. ఇంతలో శాంత్రో కారు వేగంగా దూసుకొచ్చింది. పలు బైకులను ఢీకొట్టింది. ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయనట్లుగా కనిపిస్తోంది. అయితే 72 ఏళ్ల వ్యక్తి హ్యుందాయ్ శాంత్రో కారు నడుపుతూ దూసుకొచ్చాడు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బైకిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సీసీటీవీలో రికార్డయింది. సోమవారం మధ్యాహ్నం 2:25 గంటలకు కొల్హాపూర్ నగరంలోని సైబర్ చౌక్ దగ్గర జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

ఇటీవల పూణెలో బాలుడు కారు నడిపి.. ఇద్దరు టెకీల ప్రాణాలు కోల్పోడానికి కారణమయ్యాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం నిందితుడికి గంటల్లోనే బెయిల్ రావడం కూడా విమర్శలు దారి తీసింది. అనంతరం బెయిల్ రద్దైంది. ఇక ఈ కేసులో మెడికల్ రిపోర్టులు మార్చిన డాక్టర్లు సస్పెండ్‌కు గురయ్యారు. అలాగే జువెనల్ బోర్డుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా కారు బీభత్సంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

 

Exit mobile version