పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొనడంతో వివాహ వేడుకకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణేకు 200 కిలోమీటర్ల దూరంలోని కవ్తే మహాకల్ తహసీల్ లోని విజాపూర్ – గుహాఘర్ రహదారిపై జంబుల్ వాడి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా., ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా.. కోలుకోలేక వారు కూడా తనువు చాలించారు.
Also Read: Maoists: రాళ్లు, బ్యానర్ పోస్టర్లు వేసి రోడ్డును దిగ్బంధించిన మావోలు..
బాధితులు కర్ణాటకలోని బాగల్ కోట్ కు చెందిన వివాహ వేడుకలో భాగంగా సాంగ్లీ జిల్లాలోని సవర్దేకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. జాట్ జిల్లా సాంగ్లీ సమీపంలో కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర సంఘటన జరిగింది. వీరంతా వారి బంధువు ఇంట పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి చేర్చారు.
Also Read: Eagle : నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన ఈగల్ తమిళ్ వెర్షన్..
వేగంగా వచ్చిన కారు.. బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. వలస కూలీలతో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు జాట్ నుంచి ముంబైకి వెళ్తున్నట్లు పోలీస్ అధికారలు తెలిపారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు కొద్దిమందికి గాయాలు కావడంతో వారిని కూడా సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. బస్సులోని దాదాపు 10 నుంచి 15 మంది వరకు ప్రమాదంలో గాయపడ్డారని.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.