NTV Telugu Site icon

Cars24 CEO: కన్నడ మాట్లాడటం రాదా? ఢిల్లీకి రండి.. రచ్చకు దారి తీసిన పోస్ట్..

Cars24

Cars24

Cars24 CEO: కన్నడ అంటే ఆ కర్ణాటకలోని ప్రజలకు ఎంత అభిమానమో అందరికి తెలుసు. అయితే, ఇది ఇటీవల కాలంలో దురభిమానంగా మారుతోంది. వేరే ప్రాంతాల నుంచి బెంగళూర్, ఇతర కర్ణాటక ప్రాంతాల్లో పనిచేసే వారు తప్పకుండా కన్నడ మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కన్నడ మాట్లాడని వారిపై దాడులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా కార్స్24 సీఈఓ విక్రమ్ చోప్రా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ఉద్యోగాల కోసం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ బెంగళూర్‌లో ఏళ్లుగా ఉంటున్నా ఇంకా కన్నడ మాట్లాడలేకపోతున్నారా..? ఫర్వాలేదు. ఆ జావో ఢిల్లీ(ఢిల్లీకి రండి)’’ అంటూ పోస్ట్ చేశారు. మీరు తిరిగి రావాలనుకుంటే, సబ్జెక్టుతో vikram@cars24.comకి మెసేజ్ చేయండి-మేరీ జాన్ అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఇంటికి దగ్గరగా ఉండాలనుకునే ఇంజనీర్ల కోసం మేము వెతుకుతున్నామని చెప్పారు.

READ ALSO: YCP-Visakha Dairy: వైసీపీకి విశాఖ డెయిరీ ఛైర్మన్‌ రాజీనామా!

ప్రస్తుతం ఆయన చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చాలా మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రాంతీయ పక్షపాతం గురించి చర్చించారు. కన్నడిగులు మాత్రం ఆయననున విమర్శించారు. కన్నడను తక్కువ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మీరు ఉద్యోగాల కోసం పోస్ట్ చేయాల్సిన సందేశం ఇది కాకపోవచ్చు అంటూ కొందరు ఆయన పోస్టును వ్యతిరేకించారు. అయితే, కొందరు మాత్రం బెంగళూర్‌లో నివసిస్తున్న, పనిచేస్తున్న కన్నడ మాట్లాడని వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మిస్టర్ చోప్రా మాట్లాడారని ఆయనకు మద్దతు నిలుస్తున్నారు.

గత ఏడాది జూన్ నెలలో కర్ణాటక ముక్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాపతంగా కన్నడ వాతావరణం నెలకొనాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలోని ప్రజలందరూ తమ రోజూ వారీ జీవితంలో కన్నడను స్వీకరించాలని కోరారు. కన్నడ భాష, నేల, నీటిని కాపాడుకోవడం ప్రతీ కన్నడిగుడి బాధ్యత అని ఆయన అన్నారు.