Site icon NTV Telugu

Kiara Advani: ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2024లో కియారా అద్వానీ!

Kiara Advani

Kiara Advani

యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌’ 2024కు బాలీవుడ్ భామ కియారా అద్వానీ హాజరుకానున్నారు. ఉమెన్ ఇన్ సినిమా గాలాలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కేన్స్ 2024లో రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌’లో కియారా పాల్గొననున్నారు. ఇదివరకు ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్.. వంటి బాలీవుడ్ హీరోయిన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ మే 14 నుండి 25 వరకు జరగనుంది.

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో కియారా అద్వానీ, సల్మా అబు దీఫ్, సరోచా చంకిమ్హా, అధ్వా ఫహద్, అసీల్ ఒమ్రాన్, రమతా టౌలే సై పాల్గొంటారు. వినోద రంగానికి వీరి సహకారాన్ని గుర్తిస్తుంది. గ్లోబల్ ఇన్సెంటివ్‌లు, చిత్రీకరణ గురించి నాలుగు ప్యానెల్ చర్చలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో జరుగుతాయని వానిటీ ఫెయిర్ పేర్కొంది. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్‌లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.

Also Read: Team India Head Coach: హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు.. అర్హతలు ఇవే!

లోరియల్‌కి అంబాసిడర్‌లుగా ఉన్న ఐశ్వర్య రాయ్, అదితి రావు హైదరీ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో సందడి చేయనున్నారు. ఐశ్వర్య కేన్స్‌కు రెగ్యులర్‌గా హాజరవుతుండగా.. అదితి 2022లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అరంగేట్రం చేశారు. భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు అభిమానులకు కియారా అద్వానీ దగ్గరయ్యారు. ఇప్పుడు ఆమె గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. 2014లో ఫగ్లీ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కియారా.. లస్ట్‌ స్టోరీస్‌, కబీర్‌ సింగ్‌, సత్యప్రేమ్‌ కీ కథా, భూల్ భూలయ్యా 2, వార్ 2, షేర్షా, ఎంఎస్ ధోనీ లాంటి హిట్ సినిమాలో నటించారు.

Exit mobile version