Site icon NTV Telugu

Canara Bank : ‘కెనరా ఏఐ1’ పేరుతో యాప్‌ రిలీజ్‌.. 250కుపైగా ప్రత్యేకతలు

Canara Bank App

Canara Bank App

Canara Bank Launched Canara AI1 APP.
బ్యాంకింగ్‌ రంగ సంస్థల్లో కెనరా బ్యాంక్‌ సరికొత్త ఫీచర్లతో ‘కెనరా ఏఐ1’ యాప్‌ను లాంఛ్‌ చేసింది. ఈ యాప్‌లో అద్భత ఫీచర్లను పొందుపరిచారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కెనరా ఈ యాప్‌ను ప్రారంభించినట్లు కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. ‘కెనరా ఏఐ1’ యాప్‌ను లాంఛ్‌ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 250కుపైగా ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు వన్‌స్టా్‌ప సొల్యూషన్‌గా సేవలందిస్తుందన్నారు ఎల్‌వీ ప్రభాకర్‌.

 

బ్యాంకింగ్‌ సేవల కోసం ఇకపై వేర్వేరు యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు ఎల్‌వీ ప్రభాకర్‌. యుఐ, యుఎక్స్‌ వంటి అడ్వాన్స్‌ ఫీచర్స్‌ ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు ఎల్‌వీ ప్రభాకర్‌. ఇప్పటికే 35 లక్షల మంది కెనరా ఏఐ1 సూపర్‌ యాప్‌ను వినియోగిస్తున్నారని వెల్లడించారు ఎల్‌వీ ప్రభాకర్‌. అత్యాధునిక ఆప్షన్‌లను ఇందులో పొందుపరిచినట్లు ఎల్‌వీ ప్రభాకర్‌ వివరించారు.

 

Exit mobile version