Candle Rally: విజయవాడలో కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారికి సంతాపంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. స్వరాజ్య మైదానంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సరైన పరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, ఎమ్మెల్సీ రాహుల్లా, జగ్గయ్యపేట ఇంచార్జ్ నాగేశ్వరరావు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Botsa Satyanarayana: కాశీబుగ్గ బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా..?
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో దర్శనానికి వచ్చే భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. “దేవుడిని చూడాలా? దేవుడి దగ్గరకు వెళ్లాలా అనే విధంగా పరిస్థితి ఉంది” అని ఘాటు వ్యాఖ్య చేశారు. గతంలో 2014-19 మధ్య దేవాలయాలు కూల్చేశారని, ఇప్పుడు తిరుపతి లడ్డుపై విష ప్రచారం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని, అందుకే రాజమండ్రి పుష్కరాల్లో 20 మందికి పైగా చనిపోయారని గుర్తు చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే.. పవన్ కళ్యాణ్ ఈ మృతుల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. తమ వైఫల్యం కనిపించినప్పుడల్లా ప్రభుత్వం ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు దిగుతుందని, జోగి రమేష్ అరెస్ట్ అందులో భాగమేనని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Iran Nuclear Program: ట్రంప్‌కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’
ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్లే భక్తుల ప్రాణాలు పోయాయని ఆరోపించారు. కాశీబుగ్గ ఘటనపై మాత్రం “దేవాలయం ప్రైవేటుది” అని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. హిందూ దేవాలయాలంటే కూటమి నేతలకు చులకన భావం ఉందని అన్నారు. లడ్డులో కల్తీ అని పవన్ కళ్యాణ్ ఊగిపోయారని.. కానీ తిరుపతి, సింహాచలం.. ఇప్పుడు కాశీబుగ్గ ఘటనల విషయంలో మాత్రం పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు. కేవలం 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కూటమికి పరిపాలన చేసే అర్హత లేదని అన్నారు.
