NTV Telugu Site icon

Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది

Fd

Fd

డబ్బును సేఫ్ గా ఉంచుకోవడానికి మంచి ఉపాయం బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం. అయితే ఎఫ్ డీ చేసే ముందు మనం ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను అందిస్తున్నాయో తెలుసుకొని ఎఫ్ డీ చేస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ లు కూడా తరచూ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపో రేటు, రివర్స్ రెపోరేటుపై ఆధారపడి ఉంటాయి. అయితే కొద్దిరోజుల కిందట ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు ఎఫ్ డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకొని తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. ఈ పెంచిన రేట్లు ఆగస్టు 12 నుంచే అమలులోకి వచ్చాయి. సాధారణంగా కెనరా బ్యాంక్ లో 7 రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లను సవరించిన తర్వాత 7 రోజుల నుంచి పదేళ్ల లోపు టెన్యూర్ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కెనరా బ్యాంక్ 4 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇదిలా వుండగా సీనియర్ సిటిజెన్లకు మాత్రం ఇది 4 శాతం నుంచి 7.75 శాతంగా ఉంది. అంటే వీరు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువ వడ్డీ పొందవచ్చు. చాలా బ్యాంక్ ల్లో ఈ వడ్డీ రేట్లు 2.5 నుంచి 7 శాతం వరకే ఉన్నప్పటికీ ప్రభుత్వ బ్యాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కస్టమర్స్ కు గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి.ప్రభుత్వ బ్యాంక్ కాబట్టి ఎక్కువ కాలం డబ్బు దాచుకోవడానికి కూడ భయపడాల్సిన పనిలేదు.

Also Read: Chicks with Cat: పిల్లి ఒడిలో కోడి పిల్లలు.. చూసి షాకైన తల్లి

ప్రస్తుతం కెనరాబ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల్లో ముగిసే డిపాజిట్లపై 4 శాతం వడ్డీ అందిస్తోంది. 46 నుంచి 90 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ వస్తోంది. ఇక 91 రోజుల నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ వర్తిస్తుంది180 రోజుల నుంచి 269 రోజుల టెన్యూర్ ఉన్న డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ వస్తుంది.ఇక 270 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై ప్రస్తుతానికి కెనరా బ్యాంక్ 6.50 శాతం వడ్డీ అందిస్తోంది. ఏడాది వ్యవధి ఉన్న FD లపై కెనరా బ్యాంక్ తాజాగా 6.90 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక అత్యధికంగా 444 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండటం

ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.90 శాతం వడ్డీ అందిస్తుండగా.. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 6.85 శాతం వడ్డీ అందిస్తోంది.మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఆపైన టెన్యూర్‌పై 6.7 శాతం వడ్డీ ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే గరిష్టంగా పదేళ్ల టెన్యూర్‌పై 7.2 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం రూ. లక్ష రూపాయలను 10 యేళ్ల పాటు ఫిక్స్‌డ్ చేస్తే అది రెండు లక్షల రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ మంచి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏటంటే మెచ్యూరిటీ కన్నా ముందే మనం డబ్బులు విత్ డ్రా చేస్తే ఒక శాతం పెనాల్టీగా విధిస్తుంది కెనరా బ్యాంక్. సాధారణంగా ఇది మనం దాచుకున్న డబ్బులో కట్ చేస్తారు అని అనుకుంటారు అందరూ కానీ ఈ పెనాల్టీ మన వడ్డీ రేటులో ఉంటుంది. అంటే మనకి ఇచ్చే వడ్డీ రేటులో ఒక శాతం తగ్గుతుంది.