Site icon NTV Telugu

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

Lik

Lik

షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకుని.. యూత్ ఐకాన్ హీరోగా మారిన యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్‌ చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కలెక్ట్ చేసి కోలీవుడ్‌లో ఓ యంగ్ హీరో టచ్ చేయని ఫీట్ సాధించాడు. ప్రదీప్ సినిమా ఒప్పుకుంటే.. వంద కోట్లు రాబట్టుకున్నట్లేనన్న ఫీలింగ్స్ మేకర్స్‌లో క్రియేట్ చేసుకున్నాడు. యూత్ అట్రాక్ట్ చేసే స్క్రిప్ట్ సెలక్షన్ ఎంచుకుంటోన్నఈ జూనియర్ ధనుష్.. లవ్ ఇన్సురెన్స్ కంపెనీలోనూ ఇలాంటి సబ్జెక్టే టచ్ చేస్తున్నాడు.

Also Read : Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ హిట్స్‌తో జోరుమీదున్న ప్రదీప్ రంగనాథన్‌కు LIkమూవీ ఛేజింగ్ మూవీ. లవ్ టుడే తర్వాత ఒప్పుకున్న ఈ ఫిల్మ్ రెండున్నరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. రెండవ సినిమాగా రావాల్సిన ఈ ఫిల్మ్ నాల్గవ సినిమాగా రిలీజౌతుంది. దీనికి తోడు వంద కోట్లకు పైగా రాబట్టాలన్న ప్రెజర్ ఆటోమేటిక్‌గా అతడి సినిమాపై పడిపోయింది. దీంతో ప్రదీప్ సైతం వంద కోట్ల టార్గెట్ విషయంలో నెర్వస్‌గానే ఫీలవుతున్నాడు. ఈ సినిమా కేవలం ప్రదీప్‌కు మాత్రమే కాదు.. కృతి శెట్టి అండ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌కు చాలా కీలకం. ప్రతి ఇండస్ట్రీలో వంద కోట్లు రాబట్టుకునే బేబమ్మ.. తమిళ ఇండస్ట్రీలో వా వాతియార్ రూపంలో తడబడింది. ఒకవేళ లైక్ వందకోట్లు క్రాస్ చేస్తే.. వా వాతియార్ కన్నా ముందు ఒప్పుకున్న ఫిల్మ్ కాబట్టి.. లెక్కలు సరిచేయనుంది. ఇక విఘ్నేశ్ శివన్‌కు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. శివకార్తీకేయన్ కాదంటే.. ప్రదీప్‌కు కథ చెప్పి.. లెంత్తీగా వండి వార్చబోతున్నాడు. అందులోనూ నయనతారను పెళ్లి చేసుకుని, తండ్రిగా ప్రమోట్ అయ్యాక రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో స్పెషల్ మూవీగా మారింది. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాని నయన్.. ఈ సినిమాకు వచ్చి భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చింది. మరీ ఈ ముగ్గురికి లైక్ ఫిల్మ్.. లైక్ ఇస్తదో.. అన్ లైక్ ఇస్తదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

Exit mobile version