NTV Telugu Site icon

UP Minister: టమాటా తినడం మానేయండి.. అధిక ధరలపై యూపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Up Minister

Up Minister

UP Minister: దేశవ్యాప్తంగా టొమాటో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా ఆదివారం టమాటాలు ఖరీదైనవి అయితే, వాటిని ఇంట్లో పండించండి లేదా వాటిని తినడం మానేయాలని ప్రజలకు సూచించారు. యూపీ ప్రభుత్వం చేపట్టిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం క్రింద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రతిభా శుక్లా మొక్కలు నాటారు.

“టమోటాలు ఖరీదైతే, ప్రజలు వాటిని ఇంట్లో పండించాలి, మీరు టమోటాలు తినడం మానేస్తే ధరలు అనివార్యంగా తగ్గుతాయి. మీరు టమోటాలకు బదులుగా నిమ్మకాయను కూడా తినవచ్చు, ఎవరూ టమోటాలు తినకపోతే, ధరలు తగ్గుతాయి” అని మంత్రి ప్రతిభా శుక్లా అన్నారు. అసహి గ్రామంలోని న్యూట్రిషన్ గార్డెన్‌ను ఉదాహరణగా చూపుతూ ఈ ధరలు పెరగడంపై పరిష్కారం ఉందని, ఇంట్లో టమోటా మొక్కలు నాటాలని మంత్రి అన్నారు. “మీరు టమోటాలు తినకపోతే నిమ్మకాయను వాడండి, ఏది ఎక్కువ ఖరీదైనది, దానిని విస్మరించాలి.. అలా చేస్తే అది దానంతట అదే చౌకగా మారుతుంది.” అని ఆమె అన్నారు.

Also Read: Harish Rao: కేంద్రంపై మంత్రి హరీష్ ఫైర్.. కమలంపై కన్నెర్ర

ఇదిలా ఉండగా, టమాటాతో సహా 22 నిత్యావసర ఆహార వస్తువుల రోజువారీ ధరలను వినియోగదారుల వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తుందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన టమాటా ధరలను పరిశీలించి వినియోగదారులకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద టమాట కొనుగోళ్లను ప్రారంభించి వినియోగదారులకు అధిక రాయితీపై అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు.

Show comments