ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ ఔటైన విధానం ఇప్పుడు తీవ్రదుమారం రేపుతోంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్‍ది నాటౌట్ అని అభిప్రాయపడుతున్నారు. ఇక 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చేందుకు ట్రై చేశారు.
Read Also: Toll Tax Hike: మళ్లీ పెరిగిన టోల్ ట్యాక్స్.. అమల్లోకి కొత్త ధరలు
ఈ క్రమంలో గిల్ ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్‍లో కామెరూన్ గ్రీన్‍కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే గ్రీన్ పట్టిన క్యాచ్ స్పష్టంగా లేకపోవటంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. కాగా.. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో స్పష్టం రాలేదు. దీంతో చివరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్‌లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PAN-Aadhaar Link: పాన్ – ఆధార్ లింక్.. 5 సంవత్సరాలలో 15 సార్లు గడువు పొడిగింపు!
ఇక ఈ వివాదంపై నాలుగో రోజు ఆట అనంతరం కామెరూన్ గ్రీన్ రియాక్ట్ అయ్యాడు. తను క్లియర్ గానే క్యాచ్ పట్టానని గ్రీన్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో నేను అది క్లియర్ క్యాచ్ అనుకుని బంతి పైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాను.. నా వైపు నుంచి ఎటువంటి సందేహాలు లేవు.. కానీ తుది నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వదిలేశాను అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో నేను కొన్ని మంచి క్యాచ్‌లను పట్టుకున్నాను.. కానీ రెండో రోజు ఆటలో కొన్ని సులభమైన క్యాచ్‌లను కూడా విడిచిపెట్టాను.. అది నన్ను చాలా నిరాశపరిచింది.. అయితే తర్వాత అంతకమించిన క్యాచ్‌లను పట్టడం చాలా సంతోషంగా ఉంది అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో కామెరూన్ గ్రీన్ పేర్కొన్నాడు.