Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Cameron Green Becomes 3rd Australian To Concede 100 Plus Runs In Single Odi Innings

IND vs AUS: భారత బ్యాటర్ల విధ్వంసం.. కెమరూన్‌ గ్రీన్‌ ఖాతాలో చెత్త రికార్డు!

Published Date :September 25, 2023 , 7:21 am
By Sampath Kumar
IND vs AUS: భారత బ్యాటర్ల విధ్వంసం.. కెమరూన్‌ గ్రీన్‌ ఖాతాలో చెత్త రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్‌ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (72 నాటౌట్‌; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దాంతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో భారత్ అత్యధిక స్కోర్ నమోదు చేసింది.

భారత బ్యాటర్ల ధాటికి ఆస్ట్రేలియా పేసర్‌ కెమరూన్‌ గ్రీన్‌ ఓ చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున మూడో చెత్త బౌలింగ్‌ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. రెండో వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్రీన్‌.. రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో మిక్‌ లెవిస్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లెవిస్‌ 113 పరుగులు ఇచ్చాడు. ఆసీస్‌ తరఫున అత్యంత చెత్త బౌలింగ్‌ ప్రదర్శన ఇదే. ఈ నెలలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా 113 పరుగులు సమర్పించుకుని.. ఆసీస్‌ తరఫున రెండో చెత్త బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇండోర్‌ వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో కెమరూన్‌ గ్రీన్‌ 103 పరుగులు సమర్పించుకుని ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఆండ్రూ టై 100 పరుగులు సమర్పించుకుని నాలుగో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ఆసీస్‌ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు ఈ నలుగురే. ఇక వన్డేల్లో భారత్‌పై అత్యంత చెత్త ప్రదర్శన జాబితాలో శ్రీలంక బౌలర్‌ నువాన్‌ ప్రదీప్‌ (0/106) మొదటి స్థానంలో ఉన్నాడు. కివీస్ పేసర్ టిమ్‌ సౌథీ (0/105) రెండో స్థానంలో ఉండగా.. కెమరూన్‌ గ్రీన్‌ (2/103) మూడో స్థానంలో ఉన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia
  • Cameron Green
  • Cameron Green Record
  • Cameron Green Worst Record
  • ind vs aus

తాజావార్తలు

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions