NTV Telugu Site icon

Cheese: ఖరీదైన చీజ్.. దీన్ని తినే డబ్బులతో కారు కొనుక్కోవచ్చు.. స్పెషాలిటీ ఏంటంటే?

Cheese

Cheese

Cabrales cheese: చీజ్ ని చాలా వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. పిజ్జా తయారీలో అయితే ఇది చాలా ముఖ్యమైనది. పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడే మనకు ఎక్స్ ట్రా ఛీజ్ అనే అప్షన్ కూడా ఉంటుంది. కేవలం పిజ్జాలోనే కాకుండా సాధారణంగా ఇంట్లో చేసుకునే కొన్ని వంటకాల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీని ధర ఎంత ఉంటుంది. మహా అయితే రెండు వందలో మూడు వందలో ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే మనకు అన్ని సూపర్ మార్కెట్లలలో లభిస్తుంది. చాలా మంది దీనిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీజ్ రేటు వింటే మాత్రం అమ్మో అంతా అనడం గ్యారెంటీ ఎందుకంటే దానిని కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆ చీజ్ కొనే డబ్బులతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు కొనుక్కుంటుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంవత్సరం శాలరీ కంటే ఎక్కువే ఉంటుంది ఆ చీజ్ ధర. ఇంతకీ దాని ధర ఎంత అనుకుంటున్నారా అక్షరాల మన భారతీయ కరెన్సీలో రూ.13.50 లక్షలు. ధర చూడగానే షాక్ అయ్యారు కదా. అయితే ఈ చీజ్ లో ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంతరేటు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:  Wild Dog Vs Buck: దుప్పి మెడను పట్టుకొని చంపడానికి ప్రయత్నించిన అడవి కుక్క..ఫైట్ మాములుగా లేదుగా

సాధారణంగా మనకి తెలిసిన చీజ్ ను పాలను ఉపయోగించి మిషన్ల ద్వారా ప్రాసెస్ చేసి చేస్తారు. అయితే ఈ చీజ్ తయారీలో ఎలాంటి మిషన్లను ఉపయోగించరు కేవలం చేతితో మాత్రమే చేస్తారు. అయితే దీని ప్రత్యేకత ఇది మాత్రమే కాదు. దీనిని తయారు చేయడానికి ఆవు, మేక, గొర్రె పాలను ఉపయోగిస్తారు. వీటిని కలిపి లాస్ పికోస్ డి యూరోపా పర్వతం గుహలో నిల్వ చేస్తారు. అలా గుహలో పెట్టడం వల్ల వాటిపై నీలిరంగు మచ్చలు, చారలు ఏర్పడతాయి. తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకువెళ్లి ప్రాసెస్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 8 నెలల సమయం పడుతుంది. దీనిని 7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక పరిస్థితుల్లో తయారు చేస్తారు. దీనిని స్పెయిన్ లోని లాగర్ డి కొలోటో అనే రెస్టారెంట్ తయారు చేస్తుంది. దీనిని “కాబ్రెల్స్ బ్లూ చీజ్“ అని అంటారు. దీని టేస్ట్ కూడా మాములుగా చీజ్ కంటే భిన్నంగా ఉంటుంది. అయితే 2019 లో ఈ చీజ్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యింది. ఇప్పుడు మళ్లీ దాని రికార్డులను అదే బ్రేక్ చేసింది. ఇటీవల లాగర్ డి కొలోటో  రెస్టారెంట్ రెండు కేజీల కాబ్రెల్స్ బ్లూ చీజ్ ను  ఏకంగా 30 వేల యూరోలకు అమ్మారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 27 లక్షలు. అంటే కేజీ రూ. 13.5 లక్షలు. ఇప్పుడు చెప్పండి ఈ డబ్బులతో సామాన్యుడు కారు కొనుక్కోగలడో లేడో.