Site icon NTV Telugu

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇంటి గోడను ఢీకొన్న క్యాబ్

Kiren Rijiju

Kiren Rijiju

Kiren Rijiju: ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం గోడను బుధవారం ఓ క్యాబ్ ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి గోడలో కొంత భాగం కూలిపోయి, ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో వెళ్తుండగా రహీమ్‌ఖాన్ అనే క్యాబ్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి దగ్గరలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇంటి గోడను ఢీకొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హర్యానాలోని నుహ్‌కు చెందిన డ్రైవర్‌ను పట్టుకున్నారు.

Read Also: Sheikh Mohammed bin Rashid: చంద్రయాన్-3 విజయవంతంపై దుబాయ్ రాజు అభినందనల వెల్లువ

తాను తన కుటుంబ సభ్యులతో కలిసి హర్యానాలోని నుహ్‌కు వెళ్తున్నట్లు క్యాబ్ డ్రైవర్ రహీమ్ ఖాన్ తెలిపారు. మార్గమధ్యంలో ఓ బస్సు ఆయన క్యాబ్‌ను ఢీకొట్టడంతో ఆ వాహనం మంత్రి ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ సంఘటన తర్వాత భద్రతా సంస్థల అధికారులు క్యాబ్‌ డ్రైవర్‌ రహీమ్ ఖాన్‌ను వెళ్లనివ్వడానికి ముందు వివరంగా ప్రశ్నించారు. గతంలో న్యాయ మంత్రిగా పనిచేసిన కిరణ్ రిజిజు ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎర్త్ సైన్సెస్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన అరుణాచల్ వెస్ట్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Exit mobile version