Site icon NTV Telugu

BV Raghavulu: కేంద్ర సర్కార్ రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది

Bv Raghavulu

Bv Raghavulu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి గౌరవం సంపాదించే పరిస్థితి లేదు అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. బీజేపీకి జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు ఆయన ఆరోపించారు. బీజేపీని భుజాన మోస్తున్నారు.. వివిధ విధానాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోంది.. స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్ణయించింది.. చాలా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించినా జగన్ మాత్రం దాన్ని అమలు చేస్తున్నారు.. రాజకీయ నేతలను భయపెట్టి జైలులో పెట్టి పాలన చేస్తున్నారు.. వామ పక్ష పార్టీలు ప్రజా ఉద్యమాలను కూడా జగన్ అణిచివేస్తున్నాడు అంటూ బీవీ రాఘవులు అన్నాడు.

Read Also: Naseeruddin Shah: ‘ఆర్ఆర్ఆర్, పుష్ప’పై సీనియర్ నటుడు సంచలన ఆరోపణలు

రాష్ట్రంలో శాసనసభ ఉందా లేదా అని అనుమానం కలుగుతుంది అని సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రశ్నించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టులో బీజేపీ కుట్ర.. జగన్ కక్షసాధింపు ఉన్నాయి.. ఎన్నికలలో ప్రయోజనాలు ఆశించే, చంద్రబాబును అరెస్ట్ చేశారు.. ప్రత్యర్థులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ప్రయోజనం కలుగుతుందని జగన్ భావిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. జగన్ కూడా జైలు జీవితం అనుభబించిన వారే.. ప్రతిపక్షాలను అణిచివేయడం వల్ల ఉపయోగం ఉండదు అంటూ బీవీ రాఘవులు తెలిపారు. ఇలాంటి ఆలోచనను జగన్ మార్చుకుంటే మంచిది అని ఆయన సూచించారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయించాలని తెలిపారు. జగన్ ను ప్రజలు గమనిస్తున్నారు అంటూ బీవీ రాఘవులు అన్నారు.

Exit mobile version