NTV Telugu Site icon

BV Raghavulu : రాజకీయాల్లో ఎవరున్న దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి..

Bv Raghavulu

Bv Raghavulu

పోలవరం 50 ఏళ్లలో పూర్తి కాదని మేము రాజశేఖర్ రెడ్డికి చెప్పామని సీపీఎం పొలిటీబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రాజకీయాల్లో ఎవరున్న దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని బీవీ రాఘవులు. ప్రాజెక్టులో మనుష్యులకు మొదటి ప్రాధాన్యత, నీటికీ రెండో ప్రాధాన్యత, ప్రాజెక్టు మూడో ప్రాధాన్యత వుండాలన్‌నారు బీవీ రాఘవులు. గిరిజనులను మనుష్యులుగా చూడడం లేదని, పట్టిసీమ కాలువలకు పోయిన భూములకు భూమికి భూమి ఇస్తూ 38లక్షలు ఇచ్చిన వాళ్ళు గిరిజనులకు ముష్టి వేస్తున్నారన్నారు బీవీ రాఘవులు. రాజధానికి భూమి ఇచ్చిన వారికి ప్లాట్ డెవలప్ చేసి ఇచ్చారు.. మరి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు బీవీ రాఘవులు. 2026 జూన్ నాటికి 1వ దశలో 12వేల కుటుంభాలకు, 25వేల కుటుంబాలకు పాత పద్దతిలో కాకుండా మిగిలిన చోట ఇచ్చే విధంగా నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.

 

నష్ట పరిహారం పై అనుభవజ్ఞులైన వారితో కమిటీ వేసి విధివిధానాలను రుపోయిందించి నష్ట పరిహారం ఇవ్వాలని, గిరిజన వినాశక ప్రాజెక్టు గా ఉండాలో, మానవ ప్రయోజన ప్రాజెక్టు గా ఉండాలో చంద్రబాబు నిర్ణయించుకోవాలన్నారు. 2017లో కాఫర్ డ్యామ్ ప్రారంభం అయ్యిందని, గిరిజనులకు నష్ట పరిహారం ఇచ్చిన తరువుతా కాఫర్ డాం కట్టాలి కానీ అలా చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పై ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని, మెడిగడ్డలో జరిగిన పరిస్థితి పోలవరానికి రాకుండా చూడాలని బీవీ రాఘవులు అన్నారు. అన్ని చోట్లా ఎలాంటి నష్ట పరిహారం ఇస్తున్నారో పోలవరం లో కూడా అలాంటి నష్ట పరిహారం ఇవ్వాలని, పోలవరం అవినీతి జరిగిందని చెప్పిన నేతలు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.