NTV Telugu Site icon

Varun Tej : వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పై గాసిప్స్.. అబ్బే అలా ఏం తగ్గలే

Varun Tej Interview

Varun Tej Interview

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. కంగువతో పాటుగా ఈ గురువారం విడుదలయింది మట్కా. కానీ మట్కా డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి ఆట నుంచే మట్కాకు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దాంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. ఓవర్సీస్ లో అయితే మట్కా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమాకు కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాలేదు.. దీంతో ఆయన జాగ్రత్తపడాల్సిన టైమ్ వచ్చిందని అర్ధం చేసుకోవాలి. రిలీజ్ రోజు కలెక్షన్స్ కేవలం లక్షల్లో గ్రాస్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో వరుణ్ తేజ్ చూసుకోవాలి.

Read Also:Viral Photo: ఒకే ఫ్రేమ్‭లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళ.. ఎక్కడ కలిశారంటే?

తన కెరీర్ మొదట్లో చేసిన ఫిదా, తొలిప్రేమ సూపర్ హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చాయి. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన మిస్టర్, లోఫర్, గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ అన్ని ఫ్లాప్ లే. వీటన్నింటి మధ్యలో వచ్చిన గద్దలకొండ గణేష్ కాస్త ఊరట ఇచ్చినా అది రీమేక్, తాజగా వచ్చిన మట్కా ఫైనల్ రన్ లక్షల్లో ముగిసేలా ఉంది. మెగా ఫ్యామిలీ స్టాంప్ ఉన్నా కూడా ఈ విధమైన కలెక్షన్స్ హీరో కెరీర్ కు అంత మంచిది కాదు. ఇక ఈ మూవీ రిజల్ట్ పక్కన పెట్టేసి వరుణ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన రెమ్యునరేషన్ విషయంలో సినీ సర్కిల్స్‌లో తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులు అందుకుంటున్న వరుణ్ తేజ్, తన రెమ్యునరేషన్ విషయంలో వెనకడుగు వేయడం లేదని.. ఆయన ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్. వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడని.. ప్రస్తుతం ఇవి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలకు కూడా వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం లేదనే చెప్పాలి.

Read Also:India-Canada: కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్