Varun Tej : వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పై గాసిప్స్.. అబ్బే అలా ఏం తగ్గలే
- దారుణమైన ఫ్లాపుగా నిలిచిన మట్కా
- మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన వరుణ్
- రెమ్యునరేషన్ తగ్గించారన్న వార్తలన్నీ అవాస్తవాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. కంగువతో పాటుగా ఈ గురువారం విడుదలయింది మట్కా. కానీ మట్కా డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి ఆట నుంచే మట్కాకు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దాంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. ఓవర్సీస్ లో అయితే మట్కా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమాకు కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాలేదు.. దీంతో ఆయన జాగ్రత్తపడాల్సిన టైమ్ వచ్చిందని అర్ధం చేసుకోవాలి. రిలీజ్ రోజు కలెక్షన్స్ కేవలం లక్షల్లో గ్రాస్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో వరుణ్ తేజ్ చూసుకోవాలి.
Read Also:Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళ.. ఎక్కడ కలిశారంటే?
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
తన కెరీర్ మొదట్లో చేసిన ఫిదా, తొలిప్రేమ సూపర్ హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చాయి. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన మిస్టర్, లోఫర్, గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ అన్ని ఫ్లాప్ లే. వీటన్నింటి మధ్యలో వచ్చిన గద్దలకొండ గణేష్ కాస్త ఊరట ఇచ్చినా అది రీమేక్, తాజగా వచ్చిన మట్కా ఫైనల్ రన్ లక్షల్లో ముగిసేలా ఉంది. మెగా ఫ్యామిలీ స్టాంప్ ఉన్నా కూడా ఈ విధమైన కలెక్షన్స్ హీరో కెరీర్ కు అంత మంచిది కాదు. ఇక ఈ మూవీ రిజల్ట్ పక్కన పెట్టేసి వరుణ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన రెమ్యునరేషన్ విషయంలో సినీ సర్కిల్స్‌లో తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులు అందుకుంటున్న వరుణ్ తేజ్, తన రెమ్యునరేషన్ విషయంలో వెనకడుగు వేయడం లేదని.. ఆయన ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్. వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడని.. ప్రస్తుతం ఇవి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలకు కూడా వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం లేదనే చెప్పాలి.
Read Also:India-Canada: కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
- Tags
- Matka
- MATKAonNOV14th
- VarunTej
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!