NTV Telugu Site icon

Nani : రూట్ మార్చిన నాని.. మళ్లీ ఆ డైరెక్టర్ కే అవకాశం ?

Nani Hero

Nani Hero

Nani : న్యాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను కొట్టారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో హిట్ 3 చిత్రంలో నటిస్తున్నారు. గతేడాది వచ్చిన హిట్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా తరువాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంపై సినీ సర్కిల్స్ లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also:West Bengal: బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఇప్పటికే ‘దసరా’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. తొలి సినిమాతోనే ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాను గ్రాండ్ గా ప్రకటించడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఆ వీడియో రిలీజ్ చేయకుండానే, సినిమా ఓపెనింగ్ జరిగింది. దసరా సందర్భంగా ఈరోజు నాని – శ్రీకాంత్ ఓదెల కొత్త సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.

Read Also:IPL 2025: ఈ ముగ్గురు వికెట్ కీపర్లకు ఫుల్ క్రేజ్.. వీళ్లను దక్కించుకోవాలంటే కోట్లు పెట్టాల్సిందే

దీనితో పాటు దర్శకుడు సుజిత్‌తోనూ నాని ఓ సినిమా ప్లాన్ చేశాడు. అయితే, శ్రీకాంత్ ఓదెల సినిమాకంటే ముందే, సుజిత్‌తో సినిమాను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్టుతో రెడీగా ఉండడంతో, సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. దీంతో శ్రీకాంత్ సినిమానే ముందుగా చేయాలని నాని ఇప్పుడు ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి సుజిత్‌తో నాని సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Show comments