NTV Telugu Site icon

Rashmika : రష్మిక కోసం ఊహించని సాయం చేసిన విజయ్ దేవరకొండ

Vijay Rashmika Engagement

Vijay Rashmika Engagement

Rashmika : కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్‌లో ఎగసి.. ఆపై బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో మూవీ రాలేదు. దాదాపు ఫ్యాన్స్‌ను పలకరించి వన్ ఇయర్ కావొస్తుంది. యానిమల్ తర్వాత.. కమిటైన చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. పుష్ప 2తో సహా ఏడు ప్రాజెక్టులు సెట్స్ పైనే ఉండటంతో రష్మిక నుండి మరో మూవీ రాలేదు. సో ఈ గ్యాప్ తగ్గించేందుకు, ఫ్యాన్స్‌ను దిల్ ఖుష్ చేసేందుకు ఫిక్స్ అయ్యింది బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ తనదే అంటోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అవుతుంది. ఓ వైపు లేడీ ఓరియెంట్ చిత్రాలు.. మరో వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తోంది.

Read Also:Rana : భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వస్తున్న రానా

ఇక పుష్ప2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక నెక్స్ట్ మూవీకి అదిరిపోయే హైప్ దక్కింది. దర్శకుడు సుకుమార్ రష్మిక నెక్స్ట్ మూవీ ‘గర్ల్‌ఫ్రెండ్’ గురించి ప్రస్తావించాడు. ఆ సినిమా టీజర్ తాను చూశానని.. అందులో రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అంటూ ఆయన పొగిడేశాడు. అయితే, ఇప్పుడు ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర టీజర్‌ని పుష్ప-2 సినిమాతో పాటు ప్లే చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా, ఈ టీజర్‌లో మరో స్పెషాలిటీ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్‌లో రష్మిక పాత్రను పరిచయం చేయడం, ఆ పాత్రను నెరేట్ చేయడం లాంటి సీన్స్‌కు ఆమె భాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతకొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నట్లుగా రీసెంట్‌గా రష్మిక ఓ ఈవెంట్‌లో క్లూ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు రష్మిక కోసం ఆమె విజయ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్త ‘గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ టీజర్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Also:Pushpa 2: మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్.. అందరిలోనూ అదే డౌట్

Show comments