GST 2.0 Complaint Process: GST తగ్గింపు తర్వాత కూడా సూపర్ మార్కెట్లు, బజార్లలో పాత ఎమ్ఎర్‌పీ ధరలకే విక్రయం కొనసాగుతోందా.. ఈ విషయాన్ని మీరు ఎక్కడైనా గమనిస్తే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసేయండి. ఎక్కడ ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారా.. మరేం పర్వాలేదు.. ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ INGRAM పోర్టల్లో ప్రత్యేక GST వర్గాన్ని జోడించింది. అలాగే పలు టోల్ ఫ్రీ నంబర్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.. 1915 / 8800001915కు నంబర్లకు ఫోన్ చేసి ఇక నూతన జీఎస్టీ ధరలకు అనుగుణంగా వస్తువులు విక్రయించని షాపులపై ఫిర్యాదు చేయవచ్చు.
READ ALSO: ICC Rankings 2025: ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాళ్ల హవా.. మూడు విభాగాల్లోనూ టాపే!
ఏయే వాటిపై ఫిర్యాదులు అంటే..
ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఈ-కామర్స్, FMCG వంటి రంగాల కింద ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటికే GST సంబంధిత ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ఫ్రారెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ (CBIC) అధికారులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ (NCH) కౌన్సెలర్లకు శిక్షణ ఇచ్చారు. GST తగ్గింపుల ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని వ్యాపారాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.
INGRAM అంటే ఏమిటో తెలుసా..
ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం (INGRAM) పోర్టల్ అనేది వినియోగదారుల ఫిర్యాదులను నమోదు చేయడం, వాటిని పరిష్కరించే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన ఒక ప్రభుత్వ పోర్టల్. ఇంది వినియోగదారులు, వ్యాపారాలు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ సంస్థలను అనుసంధానించే ఒక కేంద్రీకృత వేదికగా పని చేస్తుంది. ఇది ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఇ-కామర్స్, FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాలను కవర్ చేస్తుంది. టోల్-ఫ్రీ నంబర్ 1915, వాట్సాప్, SMS, ఇమెయిల్, NCH యాప్, వెబ్ పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా 17 భాషలలో ప్రజలు నూతన జీఎస్టీ ధరలకు అందుబాటులో లేని వ్యాపార సంస్థలపై ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇందులో నమోదు అయ్యే ప్రతి కేసును ఒక ప్రత్యేక డాకెట్ నంబర్ ద్వారా ట్రాక్ చేస్తారు.
GST 2.0 తెలుసా కదా..
ఇటీవల కేంద్రం చేసిన GST సవరణ దేశంలో 2017 తర్వాత అతి పెద్దది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబులను 5%, 18% అనే రెండు స్లాబులతో భర్తీ చేసింది. దీంతో గృహెూపకరణాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బీమా, జీవనశైలి సేవలు వంటి వస్తువులు, సేవలు మరింత సరసమైనవిగా లభించనున్నాయి. అల్ట్రా-లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధిస్తున్నారు. ఆహార ధాన్యాలు, మందులు, విద్యా ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు 5% స్లాబు కిందకు వస్తాయి.
READ ALSO: Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వివరాలు ఇలా.!
