Site icon NTV Telugu

Uttarpradesh: లఖింపూర్‌ ఖేరీలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

Accident

Accident

Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీలో లక్నోతో వెళ్తున్న ట్రక్కు, ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. బస్సు ధౌరేహ్రా నుంచి లక్నో వెళుతుండగా ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరా వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని లక్నోకు రిఫర్ చేసినట్లు లఖింపూర్ ఖేరీ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) సంజయ్ కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న ఏడీఎం, సర్కిల్‌ అధికారి(సీఓ) జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.

Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరొకరు అరెస్ట్

ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version