NTV Telugu Site icon

Bus Accident: పల్లె వెలుగు బస్సు బోల్తా.. ప్రయాణీకులకు గాయాలు

Bus Accident

Bus Accident

Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లోని బస్సు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగుబస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్ట జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Electric shock: పండగపూట విషాదం…కరెంట్ షాక్ తో యువకుడు మృతి

Show comments