Site icon NTV Telugu

Bus Accident: మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్‌ తగిలి బస్సు దగ్ధం

Rajasthan

Rajasthan

కర్నూలులో ఘోర బస్సు ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో బస్సు హైటెన్షన్ వైర్‌ తాకి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. ఇద్దరు సజీవదహనం కాగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Canada: కెనడాలో దారుణం.. భారత సంతతి మహిళ హత్య

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలో బస్సులో ఇటుక బట్టీకి చెందిన కార్మికులను తీసుకెళ్తోంది. తోడి గ్రామంలోకి బస్సు వస్తుండగా హైటెన్షన్ వైర్ తగిలింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు చనిపోగా.. 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మిగిలిన బాధితులంతా షాపురా సబ్-డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న మనోహర్‌పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇది కూడా చదవండి: Delhi Acid Attack Case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. షాకైన పోలీసులు

గత వారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. ఏపీలోని కర్నూలు దగ్గర మంటలు అంటుకుని బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.

 

 

Exit mobile version