Site icon NTV Telugu

Bus Fall Into Ditch: కాలువలో పడ్డ బస్సు.. 28 మంది మృతి

Bus Fall Into Ditch

Bus Fall Into Ditch

Bus Fall Into Ditch: ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ప్రయాణికులతో నిండిన బస్సుకు ప్రమాదం జరిగింది. మార్చులా ప్రాంతం సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు కాలువలో పడింది. ఘటన సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన స్థలానికి ఎస్‌ఎస్పీ అల్మోరా చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం SDRF సంబంధించిన మూడు బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్లు అల్మోరా ఎస్పీ ధృవీకరించారు.

Read Also: IRCTC Super APP: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వాటి కోసం ఐఆర్‌సీటీసీ ‘సూపర్‌ యాప్‌’..

ఘటనకు సంబంధించిన విషయాలను ఎస్‌డిఎం సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారని తెలిపారు. అల్మోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాల్ట్ మార్చులా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, బస్సు లోతైన లోయలో పడిపోవడంతో దాదాపు 28 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. బస్సు గర్వాల్ నుండి కుమావోన్ వెళ్తుండగా అల్మోరాలోని మెర్క్యులాలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారని, అందువల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో బస్సు తునాతునకలు అయ్యింది.

Read Also: Indonesia Volcano Erupts: భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం.. తొమ్మిది మంది మృతి

Exit mobile version