Site icon NTV Telugu

Bus Accident : అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Bus Accident

Bus Accident

వికారాబాద్ అనంతగిరిలో ఘాట్ రోడ్డులో ఆర్టీసి బస్సు బ్రేక్ ఫేల్ అవ్వడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అయితే.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి తాండూర్ వైపుగా
వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ టీఎస్ 34 టీఎ 6 363 బస్సు బ్రేకులు ఫెయిలవడంతో అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి
దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా మిగతా 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108
కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా ఎలాంటి
వాహనం రాకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.

 

డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రమాద తీవ్రత తగ్గినట్టు భావిస్తున్నారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు తాండూర్ డిపో కి చెందినది హైదరాబాద్ నుండి తాండూర్ కి వెళ్తున్న సమయంలో ఘటన బస్సు డ్రైవర్ రఫీ కండక్టర్ కృష్ణయ్య ప్రధానంగా ఈ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు తెలిపారు ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పొద‌ల్లో చిక్కుకున్న బ‌స్సును, క్రేన్ సాయంతో బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Exit mobile version