Site icon NTV Telugu

Hot Food: నాలుక కాలిపోయిందా? ఈ చిట్కాలను ప్రయత్నించండి..!

Hot Food

Hot Food

మనకు తెలియకుండానే మనం వేడిగా ఉండే ఆహారం లేదా పానీయాలు తీసుకుంటే నాలుక మండుతుంది. కొంత సమయం వరకు మనం ఎలాంటి రుచిని గుర్తించలేకపోతాం.. మరికొందరికి రెండు రోజుల పాటు ఈ నొప్పి ఉంటుంది. అయితే, ఇది సాధారణ సమస్య, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని కూల్ ఫుడ్స్ తినడం- కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా నాలుక మంట సమస్య తగ్గిపోతుంది. కానీ నాలుక తీవ్రంగా ప్రభావితమైతే, వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.. అయితే మనం నాలుక కాలితే ఎలా నయం చేయాలో తెలుసుకుందాం.

Also Read: Thamannah bhatia: బ్లాక్ ఔట్ ఫిట్లో తమన్నా సూపర్ హాట్ ట్రీట్

నాలుక మంట వేయడంతో చికాకుగా ఉన్నారా.. మీరు అయితే, తినే ఆహారం రుచి మీకు తెలుసా? దొంతవారి, కాలిన నాలుకపై ఐస్‌క్రీం లేదా ఐస్‌ క్యూబ్స్‌ రాయండి. అయితే ఐస్ ప్యాక్ మీ నాలుకకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నాలుక భరించలేని నొప్పి వస్తే.. వెంటనే చల్లని నీరు త్రాగండి త్వరగా ఉపశమనం పొందుతారు. వేడిగా ఏదైనా తిన్నా లేదా తాగిన తర్వాత మీ నాలుక చికాకుగా ఉందా? అయితే, మీరు చింతించకండి నీటిలో ఉప్పు కలపండి. ఆ నీటితో బాగా పుక్కిలించండి. నాలుక కాలిన వెంటనే తేనె తింటే ఆ మంట త్వరగా నయమవుతుంది.

Also Read: Biperjoy బాధితులకు ఉపశమనం.. సులభంగా LIC నుండి బీమా క్లెయిమ్

చక్కెర లేదా తేనెను నాలుక కాలిన ప్రదేశంలో మాత్రమే రాసుకోవాలి.. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. మీ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే నాలుకపై మంట తగ్గడం కోసం పెరుగు, ఐస్ క్రీమ్, కేక్ మొదలైన చల్లని ఆహారాన్ని తినడం వల్ల నొప్పి తగ్గుతుంది. అయితే మీ ఇంటి చిట్కాలు పని చేయకపోతే.. నాలుక నొప్పిగా ఉంటే మరియు చికాకు పెరుగుతుంటే డాక్టర్ ను సందర్శించడం మంచిది.

Exit mobile version