Buried Truth :బరీడ్ ట్రూత్ ఓటీటీ డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన, రకరకాల మలుపులు తిరిగిన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది.దీంతో ఈ డాక్యుమెంట్టరీ సిరీస్ పై చాలా ఆసక్తి నెలకొంది. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. ఈ షీనా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ కేసు గురించి ఇప్పుడు ‘బరీడ్ స్టోరీ’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ రూపొందుతుంది.. ఈ సిరీస్ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 12) రిలీజ్ అయింది.ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ నాలుగు ఎపిసోడ్లుగా ఉండనుంది. ఇరా బాహ్ల్, షానా లెవీ దీనికి దర్శకత్వం వహించారు. మేక్‍మేక్ మరియు ఇండియా టుడే గ్రూప్ ఈ సిరీస్‍ను నిర్మించాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ డాక్యు సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రమంలో లో నెట్‍ఫ్లిక్స్ నేడు ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
షీనా బోరా హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా అరెస్ట్ అయిన న్యూస్ రిపోర్టులతో ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ సిరీస్ ట్రైలర్ మొదలైంది. ముందుగా షినా.. ఇంద్రాణి సోదరి అని అనుకోవడం.. ఆ తర్వాత కూతురు అని తెలియడం కూడా ట్రైలర్లో ఉంది. ముంబైలో ముఖర్జియా, బోరా కుటుంబాల జీవితాలను మార్చేసిన ఘటనలతో ఈ సిరీస్ రూపొందింది.ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయంటూ ట్రైలర్లో చూపించడం జరిగింది.. ముఖర్జియా, బోరా కుటుంబాల్లో ఉన్న చిక్కుముడులను, సభ్యుల మధ్య దెబ్బతిన్న బంధాలను కూడా సిరీస్‍లో మేకర్స్చూపించనున్నారు. డాక్యుమెంటరీ సిరీస్ కావడంతో వీటిల్లో కొన్ని ఒరిజినల్ ఇంటర్వ్యూలను కూడా మేకర్స్ చూపించనున్నారు. ఇంద్రాణి ముఖర్జియా, వారి కుటుంబం,అటార్నీలు మరియు కొందరు జర్నలిస్టుల ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ సంక్లిష్టమైన కేసును డాక్యుమెంటరీ సిరీస్‍గా తీసుకొస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!