పిజ్జా, బర్గర్ లు అనేవి విదేశీ కల్చర్ అయిన మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.. వీటి రుచి, చూడగానే తినాలనిపించే ఆకారాలతో జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు..చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.. ఎవరికి ఇష్టమైన రుచిని వాళ్ళు ఎంపిక చేసుకొని తింటారు.. అయితే బర్గర్ లను నాన్ వెజ్, వెజ్ లతో తయారు చెయ్యడం మనం చూసే ఉంటాం.. కానీ దోమలతో తయారు చెయ్యడం చూశారా?..ఏంటి దోమలతోనా.. ఛీ.. వాక్ అనిపిస్తుంది కదా కానీ ఇలాంటి బర్గర్ లు కూడా ఉన్నాయి.. వాటి గురించి కొన్ని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..
దోమల బర్గర్‌ని ఆఫ్రికాలోని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఈ బర్గర్ పూర్తిగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఈ బర్గర్ తినడం మొదలుపెడితే శరీరంలో ప్రొటీన్ల కొరత ఎప్పటికీ ఏర్పడదని చెబుతున్నారు. అంతేకాదు దోమలతో బర్గర్ తయారు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట.. ప్రస్తుతం వర్షాకాలం.. కనుక ప్రపంచమంతటా దోమల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది.. ఆ ప్రాంతంలో దోమలను తరిమికొట్టేందుకు ఇక్కడి ప్రజలు ఓ ప్రత్యేక ట్రిక్‌ని ఉపయోగించి వాటితో బర్గర్‌లను తయారు చేయడం ప్రారంభించారు..
అంతేకాదు వాటి రుచి బాగుందని తెగ లాగిస్తారట.. ఈ బర్గర్‌లో ఉపయోగించిన టిక్కీ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ఒక టిక్కీని తయారు చేయడానికి దాదాపు ఐదు లక్షల దోమలను ఉపయోగిస్తారు. దీన్ని కలిపి ముద్దగా చేసి టిక్కీ ఆకారంలో ఇస్తారని, తక్కువ మంటపై కాల్చి బర్గర్‌లో కలుపుకుని తింటారని చెబుతున్నారు.. దోమల్లో ఉండే ప్రోటీన్స్ మనుషులకు వస్తాయని వారి నమ్మకం.. ఇలా అక్కడ దోమలను కూడా వదలకుండా తింటారు.. ఇది చూసిన వారికి బర్గర్ పై విరక్తి కలిగిన అక్కడ ఇష్టంగా తింటారు.. మీకు ప్రోటీన్స్ తక్కువగా ఉంటే అక్కడకు వెళితే ఇది ట్రై చెయ్యండి..
