NTV Telugu Site icon

Bura Narsaiah Goud : ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి

Bura Narsaiah

Bura Narsaiah

సీఎం రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని అంటున్నారని అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 వేల కోట్ల బడ్జెట్ తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని, ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. అయినా ఇప్పటి వరకు 1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలని, కానీ ఇప్పటి వరకు చేయలేదని ఆయన విమర్శించారు. కనీసం 4 వేల మందికి సంబంధించిన వివరాలు కూడా వెరిఫై చేయలేదన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులను అదేశించి వెరైఫికేషన్ చేయించండని, ఇప్పటికే గ్రాంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయిందన్నారు.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమా అందుకే తేడాకొట్టింది!.. ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్

వెరైఫికేషన్ కంప్లిట్ చేస్తే లబ్ధిదారులకు నిధులు అందుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఎన్నికల కోడ్ పడే అవకాశం ఉందని, నల్లగొండలో ఎస్ఎల్ పీసీ ప్రాజెక్టుకు 500 లేదా 600 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదన్నారు బూర నర్సయ్య గౌడ్‌. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పోటీ పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో లింకులు కాంగ్రెస్ పెట్టిందన్నారు. కానీ కృష్ణా జల వివాదంపై బీజేపీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని, బీఆర్ఎస్ కు ఓటు వేసి శూన్యమన్నారు బూర నర్సయ్య. ఆ పార్టీ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదని, బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లంకె బిందెలు ఇవ్వడానికి రెడీగా ఉందని ఆయన తెలిపారు.

Chocolate Paratha: అర్రె.. ఏంట్రా ఇది.. మనుషులు తింటారా? వీడియో చూస్తే పరోటా తినడం మానేస్తారు..